![]() |
![]() |

'కృష్ణ ముకుంద మురారి' ఇప్పుడు స్టార్ మా టీవి ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న ధారావాహిక. ఈ సీరియల్ ఎపిసోడ్-49లో కృష్ణతో మాట్లాడటానికి వాళ్ళ అత్తయ్య రేవతి వస్తుంది. "నిన్ను ఒక విషయం అడగాలి కృష్ణ.. మురారిని ఎందుకు సస్పెండ్ చేశారో తెలుసా? నీ మూలంగా నీ భర్త ఉద్యోగం పోయేలా ఉన్నా నీకు బాధ లేదా? అందరూ బాధపడుతున్నారు. మరి నువ్వు ఎందుకమ్మా ఇలా ఉన్నావ్? మా అందరికన్నా ఎక్కువ ఓదార్పు నీ దగ్గర నుండే కోరుకుంటాడు కదమ్మా. అలాంటిది నువ్వు ఏమీ పట్టనట్టు ఎందుకు ఉన్నావ్? మురారి నిన్ను బలవంతంగా పెళ్ళి చేసుకున్నాడని, వాడెవడో శివన్న కంప్లెంట్ చేయడం ఏంటి. దానికి మీ ఊరివాళ్ళంతా సాక్షులుగా నిలబడం ఏంటి. నిన్ను నిలదీయాలని కాదమ్మ.. నాకు చెప్పాలనిపించింది చెప్పాను. సమాధానం నీకు చెప్పాలనిపించినప్పుడే చెప్పు " అని కృష్ణని అడుగుతుంది రేవతి. కృష్ణ మౌనంగా ఉండిపోతుంది. కాసేపటికి కృష్ణ బయటకు వెళ్ళిపోతుంది.
ఆ తర్వాత ఇంట్లో వాళ్ళంతా కృష్ణ ఇంట్లో లేదనే విషయం తెలుసుకుంటారు. ఎక్కడికి వెళ్ళిందని, కృష్ణ కోసం ఎదురుచూస్తుంటారు. ఇంతలో కమీషనర్ తో పాటు కృష్ణ వస్తుంది. భవానీతో "కృష్ణవేణి నా దగ్గరకి వచ్చి జరిగిందంతా చెప్పింది. మురారి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. మేం నిజమేంటో తెలుసుకోకుండా సస్పెండ్ చేశాం. మీ కుటుంబం మొత్తానికి సారీ చెప్తున్నాను" అని చెప్పేసి వెళ్తాడు కమీషనర్.
"కృష్ణ.. మురారి కోసం ఇంత ధైర్యం చేసినందుకు, కేసు లేకుండా చేసినందుకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. ఇంకోసారి బయటకు వెళ్ళేటప్పుడు అక్కతో చెప్పి వెళ్ళు.. సరేనా" అని రేవతి అంటుంది. "సరే అత్తయ్య.. బాగా ఆకలేస్తుంది. పొద్దున్నుండి టిఫిన్ కూడా చేయలేదు" అని కృష్ణ అంటుంది. "అయ్యో.. సరే పదమ్మ టిఫిన్ పెడతాను" అని రేవతి అంటుంది. "భర్తకి వచ్చిన సమస్య తీర్చడం భార్య బాధ్యత అది సవ్యంగా చేసింది" అని భవాని అంటుంది.
![]() |
![]() |